నీటిలో మునిగి బావ బావమరిది మృతి
- ఒకరి మృతదేహం లభ్యం...
- మరొకరి కోసం గాలింపు...
బాన్సువాడ, మే 31 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు బావ బావమరిది లు గొర్లకు నీటిని తాగించడానికి తన కుమారుడితో కలిసి మంజీరా నదిలోకి వెళ్లగా ప్రమాదవశాత్తు బావ బామ్మర్ది నీటిలో మునిగి మృతి చెందారు. కన్న కొడుకు ముందే తండ్రి నీటిలో మునిగిపోతుంటే నిస్సా స్థితిలో ఉన్నాడే తప్ప ఏమి చేయలేని పరిస్థితి అక్కడ నెలకొంది ఈ ఘటన ఆదివారం ఉదయం నిజామాబాద్ జిల్లా పొత్తంగల్ లో చేసుకుంది.
వివరాలు వెళితే. కురుమ గంగోండ, ఆయన బావ బోర్లం గంగొండ, కురుమ గంగొండ కుమారుడు సంతోష్ తో కలిసి మంజీరా నదిలో గొర్లలు తీసుకొని నీటిని తాగించడానికి వెళ్లారు ప్రమాదవశాత్తు కురుమ గంగ నీటిలో మునిగిపోతుంటే బావ బోర్లా గంగోడ రక్షించడానికి వెళ్లి ఆయన కూడా నీటిలో మునిగిపోయారు. గట్టుమీద కురుమ గంగొండ ఐదేళ్ల బాలుడు సంతోష్ కళ్ళముందే తండ్రి, మేనమామ నదిలో గల్లంతు కావడం పట్ల వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం అందించడంతో మంజీరా నదిలో గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరొకరు కోసం గాలిస్తున్నారు.
ఈ ఘటన పట్ల పోతంగల్ లో విషాదఛాయలు అమ్ముకున్నాయి. బామ్మర్ది కుర్మా గంగోడ ను చూడడానికి రెంజల్ మండలం బోర్లం గ్రామానికి చెందిన గం గొండ రెండు రోజుల క్రితం రెండు రోజుల క్రితం పొతంగల్ కు వచ్చి బావతో కలిసి మంజీరా నదిలో గొర్లకు నీళ్లు తాగించడానికి వెళ్లి బావబామ్మర్దులు కనిపించని లోకానికి వెళ్లిపోవడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారూ.






