12 July, 2026 | 1:32 AM

తెలుగువారు గ్లోబల్ లీడ‌ర్స్‌గా మారాలి

07-07-2024 01:23 PM

ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఏపీలో వైసీపీ వల్ల జరిగిన నష్టమే ఎక్కువ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న చంద్రబాబు ఇబ్బందులు అధిగమించి ఏపీని కూడా అభివృద్ధి చేసి గట్టెక్కిస్తానని పేర్కొన్నారు.

తెలుగు వారు గ్లోబల్ లీడర్స్ గా మారాలని సీఎం ఆకాంక్షించారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో 25 మంది భారతీయులు గెలిచారని చెప్పారు. 2047 కల్లా ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ గా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. మోడీ వికసిత్ భారత్ లో తెలుగు జాతి నెంబర్ వన్ ఉంటుందన్నారు. ఉద్యోగం చేసే స్థాయి నుంనచి ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి తెలుగుజాతి ఎదిగిందని బాబు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుజాతి గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని ఆరోజు చెప్పాను.. తెలుగు జాతి గ్లోబల్ లీడర్స్ గా ఉండాలని ఈరోజు చెబుతున్నానని చంద్రబాబు వెల్లడించారు.