12 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడి.. తండ్రి అరెస్ట్
హైదరాబాద్: కూతురిపై దాడి చేసిన వ్యక్తిని చంద్రాయణగుట్ట పోలీసులు(Chandrayangutta Police ) అరెస్టు చేశారు. తన 12 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో చంద్రాయణగుట్ట పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, గురువారం రాత్రి తన తండ్రి తనపై దాడికి ప్రయత్నించినప్పుడు ఆ బాలిక అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 100కు ఫోన్ చేసింది. పోలీస్ కంట్రోల్ రూమ్(Police Control Room) నుంచి అందిన సమాచారం మేరకు, ఒక బృందం ఆ బాలిక ఇంటికి చేరుకుని ఆమెతో మాట్లాడింది.
తరువాత పోలీసులు చంద్రాయణగుట్ట చౌరస్తా సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తన తండ్రి గత కొన్నేళ్లుగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని కుటుంబంలో ఎవరికీ చెప్పవద్దని తనను బెదిరించారని ఆ బాలిక తెలిపినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా, బాధితురాలి తల్లి నుంచి కూడా పోలీసులు మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు.






