21 August, 2026 | 1:47 AM

పొంగులేటీ.. చర్చకెందుకు రాలె?

21-08-2026 01:12 AM
  1. అవినీతిపై బహిరంగ చర్చంటే భయమా?
  2. తెలంగాణ సంపద దోపిడీ
  3. రాహుల్‌బాబా వాటా ఎంత?
  4. నా ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం 
  5. నిరూపించలేకపోతే రాజీనామా చేయాలి
  6. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సవాల్
  7. మంత్రి పొంగులేటి కోసం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎదురుచూపులు     

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై తాను చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి పూర్తి ఆధారాలతో బహి రంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తాను విసిరిన సవాల్‌ను స్వీకరించి గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు రావాలని మంత్రిని కోరినప్పటికీ.. ఆయన రాలేద ని చెప్పారు.

తన ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, నిరూపించలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయా లని సవాల్ విసిరారు.  అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బుధవారం సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరిస్తే గురువారం అసెంబ్లీ మీడి యా పాయింట్‌కు రావాలని కోరారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమరయ్యతో కలిసి ఏలేటి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్‌కు చేరుకున్నారు.

మధ్యాహ్నం 2 గంటల వరకు ఎదురుచూసినా మంత్రి చర్చకు రాలేదు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అవినీతిపై తాము పూర్తి ఆధారాలతో వచ్చామని, తన అక్రమాలు బయటపడతాయనే భయంతోనే పొంగులేటి చర్చకు రా కుండా తప్పించుకున్నారని ఆరోపించారు. 

తప్పు చేశారు కాబట్టే పారిపోయారని విమర్శించారు.పొంగులేటి అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, హౌస్ కమిటీ వే యాలని ఆయన డిమాండ్ చేశారు.  కాంగ్రె స్ నాయకులు తెలంగాణ సంపదను దోచి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని, రాహుల్‌బాబా వాటా ఎంత? అని ప్రశ్నించారు.  

సంపదను దోచుకుంటున్న మంత్రులు

అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ సంపదను మంత్రులు దోచుకుంటు న్నారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ‘పొంగులేటి ఇప్పటికైనా అసెంబ్లీ వద్దకు రావాలని, 22ఏ పేరుతో ప్రైవేట్ పట్టా భూ ములను నిషేధిత జాబితాలో చేర్చడం, పేదలు, దళితుల భూములను లాక్కోవడం, వేల కోట్ల రూపాయల వి లువైన భూముల అక్రమ బదలాయింపులు, క్విడ్ ప్రో కో లావాదేవీలు, కమీషన్ల దందాపై బహిరంగంగా చర్చిద్దాం’ అని మరోసారి సవాల్ విసిరారు.

మంత్రి అయిన తర్వాత పొంగులేటి ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ భూ వ్యవహారాల వెనుక కుట్ర ఉందని స్వయంగా మంతి్ర కోమటిరెడి వెంకట్‌రెడి చేసిన వ్యాఖ్యలపైనా పొంగులేటి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వ హ యాంలో ధరణి పేరుతో లక్షల ఎకరాలను దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో అదే చేస్తుంద ని ఆరోపించారు. ఫీనిక్స్ సంస్థ నుంచి  రూ. 15 వేల కోట్ల ఆస్తు లు పొంగులేటి  సంస్థలకు బదిలీ అయ్యాయని ఆరోపించారు.  

సీబీఐ,ఈడీ దర్యాప్తుకు సిద్ధమా?

సీఎం రేవంత్ రెడ్డి... పొంగులేటి అవినీతి చిట్టాను సీబీఐ, ఈడీ దర్యాప్తునకు అప్పగించేందుకు సిద్ధమా? లేక ఆయనను కాపాడేం దుకు ప్రయత్నిస్తారా? అని ప్రశ్నించారు. ఈ అవినీతి వ్యవహారంపై ఆధారాలతో సీబీ ఐ, ఈడీ, లోకాయుక్తకు ఫిర్యాదు చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. రాహుల్‌గాంధీ కి కూడా బహిరంగ లేఖ రాస్తామని ప్రకటించారు.  ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామ ని, విచారణ జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.