పొంగులేటిని బర్తరఫ్ చేయాలి
- 22ఏ నుంచి భూముల తొలగింపునకు కమీషన్
- బలవంతంగా జాయింట్ డెవలప్‌మెంట్ ఒప్పందాలు
- బినామీల వెనుక ఎవరు?
- రాజకీయ శక్తులెవరో తేల్చాలి
- మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్
- 22ఏ దుర్వినియోగంపై రాహుల్‌కు లేఖ
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి) : రాష్ట్రంలో 22ఏ నిబంధన దుర్వినియోగమవుతుందని, ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణ లు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్త్ఫ్ చేయాలని మాజీ మంత్రి హరీ శ్‌రావు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్న వేలాది ఎకరాల ప్రైవేటు భూములను ఏకపక్షంగా 22ఏ జాబితాలో చేర్చి యజమానులను వేధిస్తున్నారని విమర్శించారు.
జాబితా నుంచి భూముల తొలగిం పునకు 30 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. నిషేధిత భూము ల వ్యవహారం వసూళ్ల రాకెట్‌గా మారిందని మండిపడ్డారు. రెవెన్యూ శాఖలో సెక్షన్ 22ఏ నిబంధనల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి గురువారం బహిరంగ లేఖ రాశారు.
యాదాద్రి జిల్లాలో సుమారు 40 వేల ఎకరాలను 22ఏ జాబితాలో చేర్చిన ట్లు నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా వెల్లడించారని, అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పం దించడం లేదని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ పరిసర ప్రాంతాల్లోని భూములపై ఉద్దేశపూర్వకం గా వివాదాలు సృష్టించి, రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జా యింట్ డెవలప్‌మెంట్ ఒప్పందాలు చేసుకునేలా భూ యజమానులపై ఒత్తిడి తెస్తున్నార ని ఆరోపించారు.
దశాబ్దాల క్రితమే అర్బన్ ల్యాండ్ సీలింగ్(యూఎల్‌సీ) కింద క్రమబద్ధీకరించిన ఆస్తులు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న భూములను సైతం తిరిగి 22ఏ జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లను స్తంభింపజేయడం దుర్మార్గమన్నారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలని డి మాండ్ చేశారు.
30 శాతం కమీషన్లు, 50:50 ఒప్పందాల వెనుక ఉన్న వ్యక్తులు, దళారులు, బినామీ సంస్థలను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఎవరో విచారణలో తేల్చాలని కోరా రు. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి ఏ ఆస్తిని ఎవరు 22ఏ జాబితాలో చేర్చారు, ఎందుకు తొలగించారు, మధ్యవర్తుల ప్రమేయం, ఆర్థిక లావాదేవీల వివరాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు అందుబాటులో ఉంచాలి
జిల్లాల వారీగా 22ఏ నిషేధిత భూముల జాబితాను పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. ఏ భూమిని ఎప్పుడు జాబితాలో చేర్చారు, ఎవరి ఆదేశాలతో తొలగించారు? అనే వివరాలను ప్రజలకు పారదర్శకంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాం గ్రెస్ ప్రకటించిన ‘భూమాత’ కార్యక్రమం భూ రికార్డులకు స్పష్టత ఇవ్వాల్సింది పోయి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా వారి ఆస్తుల ను నిషేధిత జాబితాలో చేర్చడం తగదన్నారు.
రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు, భూ వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఒక అవినీతి మం త్రిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పణంగా పెడుతుందన్నారు. వెంట నే స్వతంత్ర విచారణకు ఆదేశించి ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలని డి మాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు.






