వివేకా హత్య కేసులో కీలక మలుపు.. ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
వివేకా హత్య కేసులో కొనసాగుతున్న ఈడీ సోదాలు
హైదరాబాద్: వివేకానందరెడ్డి హత్య కేసులో(Vivekananda Reddy murder case) ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కడపలో మొత్తం 6 చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. అవినాష్ రెడ్డి ఇల్లు సహా పలుచోట్ల సోదాలు చేస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. కేసులో రాజకీయ నేతల ప్రమేయం, మనీలాండరింగ్ పై ఈడీ ఆరా తీస్తున్నారు. హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం బయటకు రావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీబీఐ దర్యాప్తు సమయంలో బయట కొచ్చిన అంశాలపై మరింత విచారణ జరగనుంది.
నిందితులకు ఇచ్చిన రూ.4 కోట్లు ఎక్కణ్నుంచి, ఎలా వచ్చిందన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కోకాపేటలోని ఓపెన్ స్కెల్ లోని అవానాష్ రెడ్డి(MP Avinash Reddy Residence) నివాసంలో ఈడీ సోదాలు చేస్తుంది. హైదరాబాద్ ఈడీ జోనల్ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. కడప జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. అవినాష్ రెడ్డి ఇంటి తాళం తెరిపించిన ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వివేకా హత్య కేసు నిందితులు సునీల్ యాదవ్, శివశంకర్ రెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. జిల్లాలోని తొండూరు మండలం తుమ్మలపల్లిలో ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో అధికారులు దాడులు చేశారు.






