15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

విద్యతోనే మార్పు

25-12-2025 12:41 AM

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

చేగుంట, డిసెంబర్ 24 : విద్య ద్వారానే వ్యక్తి జీవితంలో సమూలమైన మార్పులు జరుగుతాయని కార్మిక శాఖామంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండ లంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, విద్య ద్వారానే వ్యక్తులలో సమూల మార్పులు జరుగుతాయి అన్నారు.

చేగుంట గ్రామ పంచాయతీకి కొత్త భవనం, డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. మొత్తం 38 మందికి గాను 3,804,408 రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలైతున్నాయి అన్నారు. అర్హత గల వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. గత విద్యా సంవత్సరానికి 50,000 మంది టీచర్లను భర్తీ చేశామని, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల కరెంటు, సన్న బియ్యం లాంటి మహత్తర కార్యక్రమాల అమలవుతున్నాయని తెలిపారు.

పింఛన్ల పెంపు విషయంలో సీఎంతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. త్వరలోనే పింఛన్ల పెంపు కార్యక్రమం మొదలవుతుందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి నిధులు మంజూరు చేయాలని తెలిపారు.

దుబ్బాక నియోజకవర్గం కోసం ప్రత్యక్ష సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రికి వివరించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శాలువాతో సత్కరించారు. ఈ కార్య క్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, తూప్రాన్ ఆర్టీవో జయచంద్రారెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.