25-12-2025 12:40:11 AM
మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, డిసెంబర్ 24: కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎన్నికలెప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని ఆయన అన్నారు.
బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని మంత్రి జూపల్లి క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, నాయకులు నరసింహ, కొల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజ్, చిన్నంబాయి మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, పెంట్లవెల్లి మండల అధ్యక్షుడు మధురం నరసింహ యాదవ్, వీపనగండ్ల మండల అధ్యక్షుడు బీరయ్య యాదవ్, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు