25-12-2025 12:41:41 AM
జిల్లా పరిశ్రమల శాఖ అధికారిని జ్యోతి
వనపర్తి క్రైమ్, డిసెంబర్ 24 : కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న పీఎంఈజిపి పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని జిల్లా పరిశ్రమల శాఖ అధికారిని జ్యోతి తెలిపారు ఎoట్రపరెన్యూర్ డెవలప్మెంట్ సెంటర్ వనపర్తి మరియు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఐకెపి నాగాపూర్, రేవల్లి మండలంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్కీం పై ఎంతో చక్కటి అవగాహన కల్పించారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జ్యోతి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న పీఎం ఈజిపి స్కీం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరియు ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.
ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఎంత శాతం సబ్సిడీ వస్తుంది ఏ ఏ రంగాల వారు దీనికి అర్హులు అనే అంశాలపై వివరించారు. అలాగే పీఎంఈజీపి దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంప్రదిస్తే వారి సమస్యలకు పరిష్కారం దొరికే విధంగా ప్రయత్నిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ షేక్ నూర్, ఐపిఓ నాగేష్, ఇడిసి మేనేజర్ శ్రీకాంత్, ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు.