10 April, 2026 | 2:13 AM

తల్లిదండ్రుల అవగాహనతోనే సమాజంలో మార్పు

10-04-2026 12:28 AM
  1. కమిషనర్ సీతా దయాకర్ రెడ్డి
  2. బాలల భద్రత, విద్య, ఆరోగ్యం అందేలా సమగ్ర చర్యలు కలెక్టర్ అంకిత్
  3. చైల్డ్ రైట్స్ ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 9 (విజయక్రాంతి): తల్లిదండ్రుల అవగాహనతోనే సమాజ ంలో సాధ్యమని బాలల హక్కుల కమిషనర్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలు, బాలల భద్రతపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు బాలల హక్కులపై సమీక్ష సమావేశం గురువారం ఐ డి ఓ సి లో నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ  గిరిజన ప్రాంతాల్లో మత్తు పదార్థాల నియంత్రణ, మరుగుదొడ్ల వినియోగం, బాల్య వివాహాల నివారణ, లింగ నిర్ధారణ కేసుల అరికట్టడంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి కమిషన్కు తెలియజేస్తే తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లా పర్యటనలో భాగంగా ములకలపల్లి ధర్మన్న నగర్లో అంగన్వాడీ కేంద్రం లేకపోవడం గమనించామని, అటవీ శాఖ అనుమతుల సమస్యల కారణంగా పిల్లలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అవసరమైతే కంటైనర్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ  బాలల భద్రత, విద్య, ఆరోగ్యం అందేలా సమగ్ర చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

జిల్లాలో బాలసదన్ ద్వారా పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, 1098 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పిల్లల సమస్యలపై తక్షణ స్పందన అందిస్తున్నామని చెప్పారు.  మధ్యాహ్న భోజన పథకంపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. . గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాల నివారణతో పాటు గంజాయి, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ . ఆపరేషన్ స్త్మ్రల్, ముస్కాన్ కార్యక్రమాల ద్వారా గల్లంతైన పిల్లలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.ఈ సందర్భంగా 2023, 2024, 2025 సంవత్సరాలలో జిల్లాలో నమోదైన పోక్సో, బాల్య వివాహాలు తదితర కేసుల వివరాలను సమగ్రంగా వివరించారు.ఈ సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్కు వివరించారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కమిటీ మెంబర్లు కంచికచర్ల వందన గౌడ్, చందన, అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత, వచన్ కుమార్, భరత రాణి, సుమిత్ర దేవి, సాధిక్ భాష, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లెనినా, ఖమ్మం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి విజేత, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.