23 June, 2026 | 7:51 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

షూటింగ్ షెడ్యూల్స్‌లో మార్పులు!

25-04-2026 12:43 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘స్పిరిట్’ ఒకటి. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇందులో ప్రభాస్  జోడీగా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబేరాయ్, ప్రకాశ్‌రాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. 2027, మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకుంది.

మొదటి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో పూర్తయింది. ఇక ఈ మూవీకి సంబంధించి కీలక షెడ్యూల్ ఈ నెలలోనే జరగాల్సి ఉంది. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ మే నెలకు మారింది. ఈ గ్యాప్‌లో ప్రభాస్ యూరప్‌లో విహారయాత్ర కోసం వెళ్లారని తెలుస్తోంది.

ఈ తాజా పరిణామాల నేపథ్యంలో వచ్చే నెలలో దర్శకుడు నాగ్‌అశ్విన్ ప్లాన్ చేసిన ‘కల్కి2898ఏడీ’ సీక్వెల్ షూటింగ్ షెడ్యూల్‌లోనూ చిన్నపాటి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు సినిమాల షెడ్యూల్స్‌కు అనుగుణంగా మేకర్స్ షూటింగ్ ప్లానింగ్‌ను సర్దుబాటు చేస్తున్నారు.