29 April, 2026 | 5:02 AM

మోదీ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు

29-04-2026 02:23 AM
  1. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
  2. భారీ సభకు బీజేపీ ఏర్పాట్లు
  3. మూడు కార్పొరేషన్ల నుంచి జనసమీకరణకు ప్లాన్

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): మోదీ రాకతో రాష్ట్ర రాజకీయ మార్పు మొదలవుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. పశ్చిమ బెంగా ల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, భవిష్యత్తులో తెలంగా ణలోనూ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మే 10న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ అంశాలపై చర్చించారు. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజి గిరి కార్పొరేషన్ల పరిధిలోని 300 డివిజన్ల నుంచి జనసమీకరణ అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రావు మా ట్లాడుతూ.. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక మొదటిసారి హైదరాబాద్‌కు వస్తున్నారని చెప్పారు. రాంచందర్ రావు అధ్యక్ష తన జరిగిన ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, ఏవీఎన్‌రెడ్డి, మల్కా కొమురయ్య, పార్టీ సంస్థాగత ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ తివారి తదితరులు హాజరయ్యారు.

వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల ప్రారంభానికి మే 10న మోదీ తెలంగాణకు రాను న్నారు. సికింద్రాబాద్ పరేడ్‌మైదానంలో బహిరంగ సభకు లక్షలాది మంది హాజరయ్యేలా జన సమీకరణ చేస్తున్నారు. మూడు కార్పొరేషన్‌లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో దాదాపు 25 వేలకు జనం తగ్గకుండా తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమా చా రం. ఇటీవల జరిగిన సీఎం రేవంత్ రెడ్డి, ప్ర తిపక్ష నేత కేసీఆర్‌సభలు తలదన్నేలా భారీ జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు.