19-01-2026 12:51:34 AM
సీబీఎస్‌ఈ స్థాయిలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ పాఠ్యాంశాలు
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): పాఠశాల విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మార్పులు తీసుకురానుంది. స్టేట్ సిలబస్ స్థానంలో సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సిలబస్ పాఠ్యాంశాలను రూపొందించాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాల్లో మార్పు లు చేయాలని విద్యాశాఖ భావిస్తున్నది.
2027 నుంచి దీనిని అందుబాటులోకి తేవాలని చూస్తున్నట్టు సమాచారం. రాష్ట్రస్థాయి పాఠ్యపుస్తకాలను జాతీయ ప్రమాణా లకు అనుగుణంగా మార్చడం ద్వారా ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల ఆధారంగా నిర్వహిం చే జేఈఈ, నీట్, సివిల్ సర్వీసెస్ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేం దుకు మన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో ఈ దిశగా విద్యాశాఖ ఆలోచిస్తున్నట్టు తెలిసింది.