13 April, 2026 | 12:52 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

దేవాలయానికి రథం బహూకరణ

14-02-2026 01:08 AM

గరిడేపల్లి, ఫిబ్రవరి 13: మండలంలోని పొనుగోడు గ్రామంలో గల సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయానికి దాతలు లక్ష రూపాయల విలువగల రథాన్ని శుక్రవారం అందించారు. పొనుగోడు గ్రామానికి చెందిన ఏడిపాల రాములమ్మ జ్ఞాపకార్థం ఆమె భర్త లింగారెడ్డి, కుమారుడు ఎడిపాల సత్యనారాయణ రెడ్డి, ధర్మపత్ని నాగమణి, మనుమడు పవన్ కుమార్ రెడ్డిలు రథాన్ని దేవాలయానికి బహూకరించారు. పొనుగోడు గ్రామంలో ప్రతి ఏడాది వేణుగోపాల స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కళ్యాణం అనంతరం స్వామివారిని ఊరేగించేందుకు ఈ రథాన్ని ఉపయోగించుకునే అవకాశం కలిగింది. వేణుగోపాల స్వామి ఆలయానికి లక్ష రూపాయలతో రథాన్ని బహుకరించడం పట్ల గ్రామస్తులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.