calender_icon.png 19 February, 2026 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా రథోత్సవ వేడుక

18-02-2026 12:16:41 AM

మెదక్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మహా జాతరలో భాగంగా చివరి రోజున మంగళవారం రాత్రి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యుత్తు దీపాల కాంతులతో అత్యంత సుందరంగా రథాన్ని అలంకరించి అందులో వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు.