calender_icon.png 19 February, 2026 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా రథోత్సవం.. ముగిసిన సంబురం

18-02-2026 12:15:47 AM

  1. మంగళవారం రథోత్సవంతో ముగిసిన ఏడుపాయల మహాజాతర 
  2. అంబరాన్నంటిన మహాజాతర చివరి ఘట్టం 
  3. ఎటు చూసినా జనమే జనంతో కిక్కిరిసిన ఏడుపాయల 
  4. వెళ్ళొస్తాం తల్లి.. మళ్ళీ దర్శించుకుంటాం తల్లి.. అంటూ భక్తులు ఇళ్లకు తిరుగు పయనమయ్యారు
  5. జాతరలో యువసంద్రం..

పాపన్నపేట, ఫిబ్రవరి17: లక్షలాదిమంది భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మహాశివరాత్రి రోజు ప్రా రంభమైన మహా జాతర మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజులుగా లక్షలాదిమం ది భక్తులు వనదుర్గామాతను దర్శించి తరించారు. పగలు, రాత్రి తేడా లేకుండా భక్తులు వనదుర్గమ్మను దర్శించుకున్నారు.

తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల భక్తులు పెద్ద సం ఖ్యలో తరలి రావడంతో ఏడుపాయల క్షేత్రం కిక్కిరిసిపోయింది. మంజీరాలో పుణ్యస్నానా లు ఆచరించి అమ్మ దర్శనానికి తరలి వెళ్లా రు. తీరొక్క మొక్కులు చెల్లించుకున్నారు. మూడు రోజులుగా సాగుతున్న మహా జా తర మంగళవారం ముగిసింది. ఉత్సవాల్లో చివరి రోజు నిర్వహించే ప్రధాన ఘట్టమైన రథోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగురంగుల క లర్లు, పుష్పాలతో రతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

విద్యుత్తు దీపాల కాంతులతో అ త్యంత సుందరంగా అలంకరించి అందులో వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథం గోలి వద్ద నుంచి తాళ్లతో భక్తులు లా గుతూ.. వనదుర్గా మాత ఆలయం ముందు వరకు రథయాత్రను కొనసాగించారు. వం దల మంది భక్తులు తాడును లాగుతూ రథయాత్రను ముందుకు నడిపించారు.

ల క్షలమంది భక్తులు ఈ రథయాత్రను వీక్షించారు. రథాన్ని లాగుతూ ప్రతి ఒక్కరి నోట వన దుర్గమ్మ నామస్మరణలతో ఏడుపాయ ల కొండలు దద్దరిల్లాయి. అలా లక్షలాదిమంది భక్తులు తన్మయత్వానికి లోనయ్యా రు. రథోత్సవం ముగియడంతో కొందరు భ క్తులు ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. వె ళ్ళొస్తాం తల్లి.. మళ్ళీ దర్శించుకుంటాం తల్లి.. చల్లంగా చూడమ్మా.. వన దుర్గమ్మ తల్లి.. అంటూ వేడుకుంటూ ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. 

 జాతరలో యువ సంద్రం..

 యువత అధికంగా ఉన్న దేశం మనది. మన యువత కేవలం చదువుల్లోనూ, సాంకేతికంగానే కాకుండా భక్తిలో, ఆధ్యాత్మికతలో కూడా ముందుంటోంది. యువతి, యువకులతో కలకలలాడుతున్న మన దేశానికి యు వతే అతిపెద్ద వనరు అని.. మనకన్నా సాంకేతికంగా ముందున్న ఎన్నో పాశ్చాత్య దేశాలు మన గొప్పతనాన్ని గుర్తించాయి. ఏడుపాయల మహా జాతరలో ఒకసారి పరిశీలిస్తే ఆ సంగతి స్పష్టమవుతోంది.

ఏడుపాయల వన దుర్గమ్మ మహా జాతరలో ఎటుచూసినా యువజోరే కనిపించింది. కొందరు యువకులు అయితే జంట నగరాలు, హైదరా బాద్, తదితర ప్రాంతాల నుంచి బైకులపై వ చ్చి అమ్మను దర్శించి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం జాతరలో వినోదాన్ని ఆ స్వాదించారు. ఏడుపాయల జాతర ప్రాంగణంలో అధికారికంగా నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలను భక్తులు ప్రతిరోజూ తిలకించారు.

దేశభక్తి, భరతనాట్యాలు, పాటల రూపంలో దేశభక్తిని, ఆధ్యాత్మిక భక్తి భావాన్ని కళాకారులు భక్తులకు చూపించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ వీరేశం, సిబ్బంది, ఆయా శాఖల జిల్లా, మండల అధికారులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.