8 March, 2026 | 3:43 PM

Breaking News

ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు   •   ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •  

దేవాలయానికి రథం బహుకరణ

13-02-2026 06:31 PM

గరిడేపల్లి,ఫిబ్రవరి 13,(విజయ క్రాంతి): గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలోని సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయానికి దాతలు లక్ష రూపాయల విలువగల రథాన్ని శుక్రవారం అందించారు.పొనుగోడు గ్రామానికి చెందిన ఏడిపాల రాములమ్మ జ్ఞాపకార్థం ఆమె భర్త లింగారెడ్డి,కుమారుడు ఎడిపాల సత్యనారాయణ రెడ్డి,ధర్మపత్ని నాగమణి,మనుమడు పవన్ కుమార్ రెడ్డిలు రథాన్ని దేవాలయానికి బహూకరించారు.పొనుగోడు గ్రామంలో ప్రతి ఏడాది వేణుగోపాల స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.కళ్యాణం అనంతరం స్వామివారిని ఊరేగించేందుకు ఈ రథాన్ని ఉపయోగించుకునే అవకాశం కలిగింది.వేణుగోపాల స్వామి ఆలయానికి లక్ష రూపాయలతో రథాన్ని బహుకరించడం పట్ల  గ్రామస్తులు,భక్తులు హర్షం వ్యక్తం చేశారు.