20 August, 2026 | 1:04 PM

ఐఫోన్లలో చాట్‌జీపీటీ

12-06-2024 12:30 AM

ఇంటిగ్రేట్ చేసిన యాపిల్

న్యూఢిల్లీ, జూన్ 11: ఐఫోన్లలో ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టూల్ చాట్‌జీపీ టీని ఇంటిగ్రేట్ చేస్తున్నట్టు యాపిల్ ప్రకటించింది. చాట్‌జీపీటీని డెవలప్ చేసిన ఓపెన్ ఏఐ, ఇన్‌హవుస్‌లో డెవలప్ చేసిన ఏఐ ఫీచర్లను ఐఫోన్లలో పొందుపరుస్తున్నట్టు వార్షిక డెవలపర్ సదస్సులో యాపిల్ వెల్లడించింది. ఐఫోన్‌తో పాటు ఐప్యాడ్స్, మ్యాక్ బుక్స్‌లో ఈ టెక్నాలజీని అమర్చాలని భావిస్తున్నట్టు తెలిపింది. యాపిల్ ఇంటిలిజెన్స్‌గా పిలిచే ఏఐ ఫీచర్లు ఎంతో ఉపయక్తంగా ఉంటాయని కంపెనీ పేర్కొంది. 

యాపిల్ ఇంటిలిజెన్స్ చేసే పనులివి..

యాపిల్ ఇంటిలిజెన్స్‌తో యాజర్లు వారి రైటింగ్, కమ్యూనికేషన్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారని, రిరై ట్, ప్రూఫ్‌రీడ్, సమ్మరైజింగ్, ఇమేజ్ క్రియేషన్ చేసుకోవడంలో యూజర్లకు సహకరి స్తుందని, రఫ్ స్కెచ్‌లు రియలిస్టిక్ ఇమేజ్‌లుగా రూపాంతరం చెందుతాయని, ఒరిజిన ల్ ఎమోజిలను (జెన్‌మోజి) క్రియేట్ చేయవచ్చని యాపిల్ వివరించింది. కంపెనీ సొం త వాయిస్ అసిస్టెంట్ ‘సిరి’ మరింత సహజంగా ఉంటుందన్నది. వాయిస్ అసిస్టెంట్ వివిధ యాప్స్‌కు యాజర్లతో ఫాలో అవుతందని, ఒకదాని నుంచి కంటెక్స్‌ను మరోదానిపై అపై చేస్తుందని, యాపిల్ డివైజ్‌లకు సంబంధించిన ట్రబుల్‌షూట్ అంశాలపై సాయపడుతుందని కంపెనీ తెలిపింది.

యాపిల్ డివైజ్‌లను బ్యాన్ చేస్తా: ఎలాన్ మస్క్

చాట్‌జీపీటీని యాపిల్ డివైజ్‌ల ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇంటిగ్రేట్ చేస్తే వాటిని తన కంపెనీల్లో నిషేధిస్తానని టెస్లా వ్యవస్థాపకుడు, స్పేస్‌ఎక్స్, ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ తెలిపారు. తమ కార్యాలయాలకు వచ్చే సందర్శకులు అందరి యాపిల్ డివైజ్‌లను డోర్స్ వద్దే అప్పగించి లోపలికి రావాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.