ఈక్విటీ మార్కెట్‌వైపు పొదుపు
కుటుంబాల స్థూల పొదుపులో డిపాజిట్ల వాటా భారీగా తగ్గుతున్నది. స్థూల జాతీయ మిగులు ఆదాయంలో కుటుంబాల స్థూల ఆర్థిక పొదుపులో డిపాజిట్ల వాటా 2021 ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పడిపోయింది. గృహ పొదుపులో చాలావరకూ ఈక్విటీలు, ఇతర మదుపు సాధనాలవైపు మళ్లడమే ఇందుకు కారణం. ఈ కాలంలో షేర్లు, డిబెంచర్లలో పెట్టుబడులు 0.5 శాతం నుంచి 0.8 శాతానికి పెరిగాయి. భారత స్టాక్ మార్కెట్ల బుల్ ట్రెండ్‌తో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో అధికంగా పెట్టుబడి చేస్తున్నారని, ఇది డిపాజిట్ల వృద్ధిపై ప్రభావం చూపుతున్నదని మరో బ్యాంక్ అధికారి చెప్పారు.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫి) గణాంకాల ప్రకారం దేశంలోని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణాలోని ఆస్తులు 2019 ఏప్రిల్ 30నాటికి రూ.24.79 లక్షల కోట్లుకాగా, అవి 2024 ఏప్రిల్ 30నాటికి రెట్టింపునకుపైగా పెరిగి 57.26 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని సూచించే క్రెడిట్ డిపాజిట్ (సీడీ) రేషియో పెరిగిపోతున్నది. 2023 ఆర్థిక సంవత్సరంలో 75.8 శాతంగా ఉన్న సీడీ రేషియో 2023 సెప్టెంబర్ నుంచి 80 శాతంగా కొనసాగుతున్నది.






