21 April, 2026 | 1:13 AM

కొనుగోలు కేంద్రాలతో దళారుల వ్యవస్థకు చెక్

21-04-2026 12:12 AM

 నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

కొల్చారం, ఏప్రిల్ 20 : మండలంలోని వరిగుంతం, సంగాయిపేట, రంగంపేట, పైతర గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులను దళారుల నుంచి కాపాడేందుకు కొనుగోలు కేంద్రాలు కీలకమని చెప్పారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389, బి గ్రేడ్కు రూ.2369 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. గత సీజన్లో ఏర్పడిన సమస్యలు పునరావృతం కాకుండా ఈసారి అధికారులు సమన్వయంతో తూకం ప్రక్రియ సజావుగా నిర్వహించాలని సూచించారు.

అవసరమైతే తమ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జోగిపేటమెదక్ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నదని, సంగాయిపేటలో రైతు సంఘం భవనం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పైతరలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించగా కోనాపూర్ లో  ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస చారి, ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా బేగం, సర్పంచ్ల ఫోరం మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు రవితేజ రెడ్డి, ఆంజనేయులు,  బిఆర్‌ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గౌరీ శంకర్, యువజన విభాగం అధ్యక్షులు సంతోష్ రావు, సర్పంచులు జగన్ నాయక్, నిర్మల మల్లేశం, కాంతమ్మ ప్రభాకర్, మోహన్, లక్ష్మీ పెంటయ్య, మాజీ జెడ్పిటిసి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ముత్యం గారి మేఘమాల సంతోష్, ఏడుపాయల డైరెక్టర్ నంగునూరు గౌరీ శంకర్,మాజీ ఎంపిటిసి సభ్యులు చంద్రశేఖర్ రె .=d;”3డ్డి, ఆదాం  మంజీరా ఎఫ్ పి ఓ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.