21 April, 2026 | 1:39 AM

ఎల్లారెడ్డి మండల సర్పంచుల ఫోరం ఎన్నికలు ఘనంగా నిర్వహణ

21-04-2026 12:12 AM

ఎల్లారెడ్డి ఏప్రిల్ 20 (విజయక్రాంతి): శాసనసభ్యులు మదన్ మోహన్ ఆదేశానుసారం ఎల్లారెడ్డి మండలంలో సర్పంచుల ఫోరం ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో మండలంలోని సర్పంచులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎల్లారెడ్డి మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలిగా ప్రియాంక గణేష్ గారు ఎన్నికయ్యారు.

నూతన మండల సర్పంచ్ల ఫోరం,ఎన్నికైన కార్యవర్గం: ఉపాధ్యక్షులు: పల్లె నాగరాజ్ మంజుల సాయిలు వై.లక్ష్మి మైసయ్య,ప్రధాన కార్యదర్శి: కొయ్యల వినోద రాజా గౌడ్ కార్యదర్శి: గాది అంజయ్య,కోశాధికారి: మంగలి సంతోష్ సలహాదారులు:పులిగల దత్తు చూడనవ్యా,కార్యవర్గ సభ్యులు:కుమ్మరి మానసపండరి, సాయిలు శ్రీనివాస్ గౌడ్ పుట్ల చందు బోండ్ల మైసయ్య రతన్ నాయక్ ఇతర గ్రామాల సర్పంచులు కార్యవర్గ సభ్యులుగా కొనసాగనున్నారు.

ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సర్పంచులు హర్షాతిరేకంగా అభినందించారు. గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని నూతన కార్యవర్గం ఈ సందర్భంగా వెల్లడించింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు ప్రియాంక గణేష్ను ఎల్లారెడ్డి మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.