17-07-2025 08:17:30 AM
డమాస్కస్: సిరియా అంత్యరుద్ధం ఆసరాగా ఇజ్రాయెల్(Israel) దాడులు చేస్తోంది. సిరియాలో ప్రభుత్వ దళాలు, డ్రూజ్ రెబల్ గ్రూపుల మధ్య ఘర్షణ నెలకొంది. సిరియా రాజధాని డమాస్కస్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. డ్రూజ్ గ్రూపునకు మద్దతుగా సిరియా పై దాడులు చేస్తోంది. సిరియా సైనిక దళాల కాన్వాయ్ పైనా ఇజ్రాయెల్ బాంబులు వేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 34 మందికి గాయాలయ్యాయి. సిరియాలో స్థానిక సున్నీ బెదోయిన్ గిరిజనులు, డ్రూజ్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే వివాదం తలెత్తింది. సున్నీ బెదోయిన్ లకు మద్దతుగా సిరియా ప్రభుత్వ బలగాలు నిలిచాయి. డ్రూజ్ సభ్యులపై సిరియా ప్రభుత్వ బలగాలు దాడులు జరిపాయి. డ్రూజ్ సభ్యులకు మద్దతుగా ఇజ్రాయిల్ రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ రంలంలోకి వచ్చిన వెంటనే మళ్లీ ఇరు వర్గాలు కాల్పుల విరమణ ప్రకటించాయి.
ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ సరిహద్దులో ఉన్న దక్షిణ సిరియాలోని స్వీడా ప్రాంతంలో డ్రూజ్ మైనారిటీపై సిరియా ప్రభుత్వ దళాలు చేస్తున్న దాడికి ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దాడుల తాజా తరంగంపై సిరియా ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించకపోయినప్పటికీ, దక్షిణ సిరియాలో ఇజ్రాయెల్ నేరపూరిత, చట్టవిరుద్ధమైన ప్రవర్తనను అది ముందుగానే ఖండించింది. ఈ ప్రాంతంలో డ్రూజ్ మిలీషియాలు, బెడౌయిన్ తెగల మధ్య పోరాటం తీవ్రతరం కావడంతో ఈ ఖండన వచ్చింది. సిరియా అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ప్రభుత్వం మతాల మధ్య హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని అభివర్ణించింది. ఇది దేశ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది.