17-07-2025 12:49:29 AM
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్
నిర్మల్, జూలై 16 (విజయక్రాంతి) పోరాటాలతోనే ఉపాధ్యాయ, విద్యారంగ సమస్య లు పరిష్కారం అవుతాయని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్‌అన్నారు. బుధవారం సోన్ మండలంలో నిర్వ హించిన సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. భూమన్న యాదవ్, జె. లక్ష్మణ్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిద్దులకుంట ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. .. ఉపాధ్యాయులు ప్రస్తుతం పొందుతున్న అన్ని రకాల సౌకర్యాలు, ఉద్యమాల ఫలితంగానే సాధ్యమైందని, సమస్యలపై ఎప్పటిక ప్పుడు ఎస్టీయూ రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు. నాణ్యమైన పీఆర్సీ, డిఏలు,పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ పదోన్నతులతో పాటు బదిలీ లు చేపట్టే సాంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి,ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అన్నిప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో సంఘ నాయకులు మారెడ్డి శ్రీనివాస్, సంతోష్ కుమార్, అశోక్ కుమార్, చిన్న నర్సయ్య పాల్గొన్నారు