06-10-2025 12:42:42 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలం విశ్వనాధ్ పూర్ కాకరవేణి నదిలో(Kakaraveni river) గుర్తుతెలియని శవం లభ్యమయింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి కాకరవేణి నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న యాలాల పోలీసులు సోమవారం తెల్లవారుజామున గల్లంతైన యువకుడి కోసం జల్లెడ పడుతుండగా అతడి శవం లభ్యం అయ్యింది. మృతిచెందిన వ్యక్తి యాలాల మండల కేంద్రానికి చెందినట్టుగా తెలుస్తోంది. శవాన్ని పోస్టుమార్టం కోసం తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .