19 July, 2026 | 3:43 AM

చెన్నై లవ్ స్టోరీ పక్కా కల్ట్ క్లాసిక్

19-07-2026 01:06 AM

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయిరాజేశ్ నిర్మిస్తున్నారు. సాయిరాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ నెల 24న థియేట్రికల్ రిలీజ్‌కు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, రవిశంకర్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “రిలీజ్ ముందే సినిమా కల్ట్ క్లాసిక్ అని వేశారంటి అని అనిపించింది. కానీ ట్రైలర్ చూశాక ఇది తప్పకుండా అలాంటి విజ యం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది. అందులో అనుమానమేమీ లేదు” అన్నారు.

మరో అతిథి మైత్రి రవిశంకర్ మాట్లాడుతూ.. “కిరణ్‌ను ఒరిజినల్ స్టార్ అని పిలవాలని ఉంది. మా బ్యానర్‌లో నెకట్స్ కిరణ్ చేయబోయే సినిమాలో ఒరిజినల్ స్టార్ అని వేస్తాం. ఎక్కడా ఫేక్ అనిపించనంత మంచి పర్ ఫార్మెన్స్ చేస్తారు కిరణ్. ఆయన ఈ సినిమా తర్వాత మరింత బిజీ హీరో కావాలి. అందరికీ ఆల్ ది బెస్ట్‌” అని చెప్పారు. హీరో కిరణ్ మాట్లాడుతూ.. “అందరికీ మాటిస్తున్నా చెన్నై లవ్ స్టోరీతో మనం హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. ఎప్పుడూ తెరపై చూడని ఒక కొత్త ప్రేమకథను మా సినిమాలో చూస్తారు.

నేను ఈ సినిమా చేసినందుకు నా అభిమానులంతా గర్వపడతారు” అన్నారు. హీరోయిన్ శ్రీగౌరిప్రియ మాట్లాడుతూ.. ““చెన్నై లవ్ స్టోరీ స్వచ్ఛమైన ప్రేమకథ. కాంప్లికేటెడ్ లవ్‌స్టోరీ కూడా” అని తెలిపింది. స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయిరాజేశ్ మాట్లాడుతూ.. “కిరణ్, గౌరి ఈ సినిమాలో యాక్ట్ చేసి వెళ్లిపోయారు. ఆ కంటెంట్ చూసి రోజూ మేము మురిసిపోతున్నాం. ఇద్దరూ బెస్ట్‌పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. మా సినిమా అందరికీ త్వరగా చూపించాలని ఎదురుచూస్తున్నాం” అని చెప్పారు.

చిత్ర దర్శకుడు రవి నంబూరి మాట్లాడుతూ.. “తలపై ఇరుముడి మోసే భక్తుడు, మొక్కు చెల్లించిన తర్వాత ఇరుముడి దించుకుంటే ఎంత తేలికగా ఉంటుందో ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కంప్లీట్ పూర్తి చేశాక అలాంటి ఫీలింగ్ కలిగింది. సినిమాలో చాలా సర్‌ప్రైజెస్ ఉంటాయి. అవన్నీ థియేటర్‌లో చూసి షాక్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు” అని తెలిపారు. నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. “మా ట్రైలర్‌కు వంద రెట్లు ఇంట్రెస్టింగ్‌గా సినిమా ఉంటుంది నాది గ్యారెంటీ. కిరణ్ అన్ని సినిమాల్లో ఇది ఒక ఎవరెస్ట్‌లా నిలబడిపోతుంది” అన్నారు. చిత్ర సహ నిర్మాత ధీరజ్ మొగిలినేనితోపాటు హీరో త్రిగుణ్, నటీనటులు నరేశ్, మహేందర్, సిరి హన్మంతు, పూజ, నవీన్ కూడా మాట్లాడారు.