19 July, 2026 | 3:12 AM

వెబ్‌సిరీస్‌తో కోలీవుడ్ ఎంట్రీ!

19-07-2026 01:08 AM

బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ‘దేవర’, ‘పెద్ది’ చిత్రాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లోని జాన్వీ పాత్ర గ్లామర్‌కే పరిమితం కావడంతో అభిమానులను కొంత నిరుత్సాహానికి గురిచేసింది. ఇదిలావుంటే, ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తమిళనాట అడుగుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. జాన్వీ కోలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీకి సంబంధించి వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే, ఈ అమ్మడు తమిళంలో సినిమాతో కాకుండా వెబ్‌సిరీస్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

‘కురథి’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్‌కు తమిళ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనికి సర్‌కునమ్ దర్శకత్వం వహించనున్నారని టాక్. అయితే, ఈ విషయమై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ తమిళ ఒరిజినల్ సిరీస్ నిర్మాణాన్ని ప్రారంభించడానికి నెట్‌ఫిక్స్ సిద్ధమైందని సమాచారం. దీందో త్వరలోనే వెబ్‌సిరీస్‌పై అధికారిక ప్రకటన చేయడంతోపాటు షూటింగ్ కూడా ప్రారంభించనున్నారట మేకర్స్.