18 May, 2026 | 2:10 AM

చర్లపల్లి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు

18-05-2026 01:06 AM

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): చర్లపల్లి  తిరుచానూరు మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  తెలిపా రు. ఈ రైలు ప్రతి ఆదివారం చర్లపల్లిలో బయలుదేరి సోమవారం తిరుచానూరు చేరుకుం టుంది.

రైలు సేవలు ఈనెల 17న ఆదివారం రాత్రి 9.31 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇది  మల్కా జ్‌గిరి, కాచిగూడ,షాద్‌నగర్, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వా ల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగనుంది. వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రికి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.