calender_icon.png 27 October, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభాగ్యులకు అండగా చేయూత ట్రస్ట్..

27-10-2025 12:55:01 AM

బూర్గంపాడు,అక్టోబర్ 26,(విజయక్రాంతి):బూర్గంపాడు మండలం అంజనా పురం గ్రామానికి చెందిన షేక్ ఖాసిం అనే వ్యక్తి అనారోగ్య కారణంతో ఖమ్మం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషమ పరిస్థితులలో వైద్యం పొందుతున్న సమాచారాన్ని బాధితుడి కుటుంబ సభ్యులు మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన చే యూత ట్రస్ట్ వారికి అందించటంతో స్పం దించిన వారు వెంటనే ఆదివారం అంజనాపురం వారి నివాసానికి వెళ్లి వైద్య ఖర్చుల కోసం రూ.5000 కుటుంబ సభ్యులకు అం దజేశారు.

ట్రస్ట్ సభ్యుడు హనీఫ్ వ్యక్తిగతంగా రూ.2,000 అందించారు.ఈ కార్యక్ర మంలో ట్రస్ట్ చైర్మన్ కైపు లక్ష్మీనారాయణ రె డ్డి, వైస్ చైర్మన్ కైపు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్కిరెడ్డి మల్లారెడ్డి, కోశాధికారి రాజేష్, ట్రస్ట్ సభ్యులు మల్లేశ్వరరావు, మూల లక్ష్మీరెడ్డి, హోటల్ హనీఫ్, బిజ్జం వెంకటరామి రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.