27-10-2025 12:53:56 AM
-భయాందోళనలో ప్రజలు
బూర్గంపాడు, అక్టోబర్ 26,(విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాలలో వీధి కుక్కలకు వింత వ్యాధిసోకుతోంది. వ్యాధి సోకిన కుక్కలు వీధులలో సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతు న్నారు. ఈ వింత వ్యాధితో బాధపడుతున్న కుక్కల వెంట్రుకలు ఊడిపోయి ఎర్రగా మ చ్చలు మచ్చలుగా తయారు అయ్యాయి.
రో జంతా దురదను కాళ్లతో గోక్కుంటూ ఉండడమే కాకుండా నోటి నుంచి సొల్లు కారుతూ బక్కచిక్కిపోయి కనిపిస్తున్నాయి. కుక్కలకు వచ్చిన ఈ వ్యాధిని పశు వైద్యులు గుర్తించి వాటికి వ్యాధి నుంచి విముక్తి కలిపించాలని మండల ప్రజలు కోరుతున్నారు.