calender_icon.png 27 October, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక పోరుకు సిద్ధంగా ఉండాలి

27-10-2025 12:56:27 AM

ములకలపల్లి, అక్టోబర్ 26, (విజయక్రాంతి):స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగిన పోరుకు సిద్ధంగా ఉండాలని బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పా రావు పిలుపు నిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఈ నెల 25,26 తేదిలలో పార్టీ జెండా ఎగురా వేయాలని జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాం తారావు,అశ్వారావుపేట నియోజకవర్గం ఇం చార్జ్ మెచ్చా నాగేశ్వరావు పిలుపు మేరకు ఆ దివారం మండలంలోని 11 గ్రామపంచాయతీలలో పార్టీ జెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ శ్రేణులు సిద్ధం గా ఉండాలని కోరారు. కార్యక్రమంలో నా యకులు కర్నాటి రమేష్, కొండ్రు సుందర్రా వు, ధర్మ,రమేష్,బొర్రా సుధాకర్, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.