15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు

20-02-2026 02:03 AM

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

జడ్చర్ల, ఫిబ్రవరి 19 : మున్సిపాలిటీలోని పాత బజార్లో ఘనంగా నిర్వహించిన 396వ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే. ప్రారంభించారు.

రక్తదానం మహాదానం అని, ప్రతి యువకుడు సమాజ సేవలో భాగంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. వారి ఆశయాలు, త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. సమాజ సేవా కార్యక్రమాల ద్వారా మహనీయుల జయంతులను నిర్వహించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్. కోనేటి పుష్పలత నర్సింలు,మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి,కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.