15 April, 2026 | 2:59 AM

అంబేద్కర్ ఆశయాలు యువతకు ఆదర్శం

15-04-2026 12:27 AM

బూర్గంపాడు, ఏప్రిల్14, (విజయక్రాంతి): ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని సారపాక మాజీ సర్పంచ్ ధరావత్ చందు నాయక్ అన్నారు.మండలంలోని సారపాక వెంకటరమణ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగపరంగా అనేక చట్టాలు తీసుకువచ్చి వారి అభ్యున్నతి అంబేద్కర్ కోసం కృషి చేశారని అన్నారు.

అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడని న్యాయశాఖ ఆర్థికవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో సేవ సమితి అధ్యక్షురాలు దాసరి వెంకట రమణ, జానకమ్మ, రాణి, జె. బి. యూత్ యువకులు మోహన్, రాంబాబు, తుమ్మల కిరణ్, చెలికాని జర్జ్, గణేష్, శ్రీను, రంగా,అంబేద్కర్ శ్రీ కృష్ణ నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.