23 March, 2026 | 3:31 AM

కొండెక్కిన కోడి ధర

23-03-2026 12:24 AM

పడిపోతున్న గుడ్డు ధర

కరీంనగర్, మార్చి22(విజయక్రాంతి): ధరలు పెరగడం, నిత్యావసరాల ధరలు, కూ రగాయల ధరలు పెరగగా తాజాగా చికెన్ ధ రకు రెక్కలు రావడంతో ఏం కొనెటట్లు లే దు..ఏం తినేటట్లు లేదంటూ వాపోతున్నారు. ఒకవైపు ఎండలు ముండు తుండటంతో ప లు చోట్ల కోళ్లు మృత్యువాత పడుతున్నా యి. దీంతో దిగుమతి ఘననీయంగా పడిపోయింది. దిగుమతి లేకపోవడంతో గడచిన 4రోజులుగా చికెన్ రేట్లు పెరుగుతూనే ఉన్నా యి.

ఎండ వేడికి పలు కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోతుండటం వల్లే అసవరమైన మేరకు కోళ్ల దిగుమతి లేకపోవడంతో ఈ పరిస్థితి త లెత్తినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే చికెన్ ధర రూ.360 పెరగడం ఇదే మొదటిసారని వినియోగదారులు వాపోతున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత ధర లేదన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం కిలో స్కిన్ చికెన్ రూ. 250 స్కిన్లెస్ రూ. 290 ఉండగా.. ప్రస్తుతం రూ.320, రూ.360 చొ ప్పున అమ్ముతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 500కు పైగా ఉన్న బ్రా యిలర్, పౌల్ట్రీ ఫామ్ల్లో 30 నుంచి 50 లక్షల కోళ్ల ఉత్పత్తి జరగాల్సి ఉండగా, 25 నుంచి 30 లక్షలకు పడిపోయింది. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం తో పాటు కోడి పిల్ల ల ధర 32 రూపాయల నుండి 60 కి పెంచడంతో ఉత్పత్తులు తగ్గాయి. ప్రస్తుతం బ్రాయిలర్ కోళ్లను మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్కు ఎగుమతి అవుతున్నాయి.

దీంతో డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో కోళ్లుకు కొరత ఏర్పడడంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికితోడు దాణా ధరలు, నిర్వహణ ఖర్చు కూడా పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. ఈ మాసంతానికి కిలో స్కిన్ లెస్ కోడి ధర 400 చేరే అవకాశం ఉంది.

పడిపోతున్న గుడ్డు ధర

కోడిగుడ్డు ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. మొన్నటిదాకా పెరిగిన ధరలు ఇప్పుడు హాఫ్ రేటుకు పడిపోవడంతో ఫామ్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఇరాన్‌ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితుల కారణంగా విమానాలు, పోర్టులు ప్రభావితమై గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. 

దీంతో దేశవ్యాప్తంగా సరఫరా అధికమై ధరలు క్షీణించాయి. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ ధర రూ.4.26గా ఉండగా, స్థానిక మార్కెట్లలో రూ.4.00 కె పడిపోయింది. ఈ పరిస్థితితో పౌల్ట్రీ రంగానికి కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది.