28 July, 2026 | 1:45 AM

డ్రైనేజీ పనులు శిలాఫలకానికే పరిమితం!

28-07-2026 12:56 AM

అచ్చంపేట, జూలై 27: అచ్చంపేట మున్సిపాలిటీ 5వ వార్డులో రూ.3 లక్షలతో చేపట్టాల్సిన డ్రైనేజీ పనులు శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా ప్రారంభం కాకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్ల నర్సింహగౌడ్ మాజీ కౌన్సిలర్లు మనోహర్ ప్రసాద్ పటేల్, రమేష్రావుతో కలిసి వార్డులో పర్యటించి సమస్యలను పరిశీలించారు.

డ్రైనేజీ లేక మురుగునీరు రోడ్లపై నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎడ్ల నర్సింహగౌడ్ మాట్లాడుతూ, 2025 జూన్ 3న ఎమ్మెల్యే రూ.3 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. శిలాఫలకానికే పరిమితమైన ఈ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.