29-07-2025 12:56:51 AM
నిజామాబాద్ జులై 28: (విజయ క్రాంతి) : నిజామాబాద్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌస్‌లో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం ఆర్ ఎఫ్) 22 చెక్కులను దాదాపు 13లక్షల రూపాయలు లబ్దిదారులకు సోమవారం పంపిణి చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలోనీ పలు కాలనీల లోని బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగింది అన్నారు.
అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయి అన్నారు పేదలకు సహాయంగా అండగా. నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందిస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నాం అని ఆయన అన్నారు.
వనమహోత్సవంలో మొక్కలు నాటిన షబ్బీర్ అలీ
నిజామాబాద్ జులై 28 (విజయ క్రాంతి): నిజామాబాదు పట్టణం లోని మారుతీ నగర్ లో నిర్వహించిన ‘వన మహోత్సవం‘ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో ముస్తాబుచేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభ మైందన్నారు.
ప్రకృతి పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ సారి మరింత విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత సాధించాలనే సంకల్పంతో ముందడుగు వేసిందిఅన్నారు ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాజీ డిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అటవీ శాఖ జిల్లా అధికారి నిఖిత గ్రంధాలయ చైర్మన్ రాజి రెడ్డి నూడా చైర్మన్ కేశ వేణ, అడిషనల్ కలెక్టర్ అంకిత్ , మున్సిపల్ కమీషనర్ దిలీప్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.