29-07-2025 12:58:03 AM
మూడు దశాబ్దాల ఆదిలాబాద్- ఆర్మూర్ రైల్వే లైన్ కల నెరవేరేనా..?
నూతన రైల్వే లైన్ కోసం నిరాహార దీక్షలు
ఆదిలాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): ఉత్తర-దక్షిణ భారతాన్ని అనుసంధానం చేసే ముఖ ద్వారమైన ఆది లాబాద్ జిల్లా భౌగోళికంగానే కాకుండా ప్రకృతి సిద్ధమైన విశేషాలకు ప్రసిద్ధి. జిల్లాలో లభించే ఖనిజాలను, పంట దిగుబడులను, పారిశ్రామిక ఉత్పత్తులను వేరే ప్రాంతాలకు ఎగుమతి చేయాలన్నా అలాగే వేరే ప్రాం తాల నుండి వివిధ వస్తు సామగ్రిని జిల్లాకు దిగుమతి చేసుకోవాలన్న సరైన రైలు మా ర్గం లేకపోవడం ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఈ ప్రాంత రైతులు, వ్యాపారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు దశాబ్దాలుగా ఎదురుచూపులు
ఆదిలాబాద్- రైల్వే లైన్ నిర్మా ణం చేపట్టాలని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధు లు, ప్రజలు గత మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. పాలకుల పట్టింపు లేనితనంతో ఆదిలాబాద్ జిల్లా దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా వాసులు గత మూడు దశాబ్దాలుగా కోరుతున్న అదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణ పురోగతిపై తాజా గా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ సమీక్షించారు.
ఇప్పటికే సర్వే పనులు పూర్తి కావడంతో డీపీఆర్ (డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్) ను రూపొందించి తమకు పంపాలని సంబంధిత అధికారులను రైల్వే శాఖ మంత్రి అదేశించారని, డీపీఆర్ అందగానే ఆర్థిక అనుమ తులన్నీ మంజూరు చేయిస్తానని రైల్వే మం త్రి హామీ ఇచ్చిన ట్లు ఇటీవల కేంద్ర మంత్రి ని కలిసిన ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పా యల్ శంకర్ చెబుతున్నారు. దీంతో ప్రజల్లో ఆశ లు చిగురిస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో సుమారు 300 కిలోమీటర్ల దూరాన్ని సుమారు ఆరు నుండి ఏడు గంటల్లో చేరుకోవచ్చు, అదే రైలు మార్గంలో ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర లోని కిన్వాట్, ముద్కేడ్ కు వెళ్లి తిరిగి తెలంగాణ లోని నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలంటే సుమారు 450 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది.
దీంతో దూరభారంతో పాటు సుమారు 10 గంటల సమయం పడుతుం ది. అయితే ఆదిలాబాద్ నుండి హైదరాబాద్‌కు బస్ ద్వారా వెళ్తే రూ. 500 నుండి 600 రూపాయలు ఖర్చవుతుండగా అదే రైలులో వెళ్తే కేవలం రూ. 150 నుండి 200 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అదే ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ వరకు రోడ్డు మార్గం గుండా నూతన రైలు మార్గం ఏర్పడితే సమయంతో పాటు ఖర్చు ఆదా ఆవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
కృష్ణ ఎక్స్ప్రెస్ రైలుతో దూరాభారం...
ప్రస్తుతం ఆదిలాబాద్ నుండి తిరుపతి వరకు కొనసాగుతున్న కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు లో హైదరాబాద్ కు చేరుకోవాలంటే దూర భారం పెరుగుతుంది. ఆదిలాబాద్‌లో ప్రారంభమైన రైలు మహారాష్ట్ర లోని కిన్వాట్ - సాసర్ కుండ్- హిమాయత్ నగర్-ముద్ఖేడ్ ల మీదుగా మళ్ళీ తెలంగాణ లోని బాసర, నిజామాబాద్‌ల మీదుగా సికింద్రాబాద్ వెళ్తుంది. దీంతో రోడ్డు మార్గంతో పోల్చినప్పుడు రైలు మార్గంలో అదనంగా సుమారు 4 గంటల సమయం వృధా అవుతుంది.
ఒకవేళ ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ ల మీదుగా రైల్వే లైన్ ఉంటే సుమారు 4 గంటల సమయం ఆదా అవడమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, గుడిహత్నూర్, ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, నిర్మల్, ఆర్మూర్ ప్రాంత ప్రజలకు రైల్వే సేవలు అం దుబాటులోకి వస్తాయి. దీంతో పాటు ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో వ్యాపార, వాణిజ్య, విద్యా, వైద్యానికి అవకాశాలు మెరుగుపడతాయని ఈ ప్రాంత ప్రజల ఆశ. ఇప్పటికే ఆర్మూర్ వరకు ఉన్న రైల్వే లైన్‌కు నిర్మల్ మీదుగా 110 కిలోమీటర్లు దూరంలోని ఆదిలాబాద్ రైల్వే లైన్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
రైల్వే లైన్ కోసం నిరాహార దీక్షలు..
ఆదిలాబాద్ నూతన రైల్వే లైన్ కోసం ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికి పాలకులు పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఎంపీ ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ రైల్వే సాధన కమిటీని ఏర్పాటు చేసుకొని రైల్వే లై న్ సాధన కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరాహార దీక్షలు సైతం చేశారు.
కేంద్రమంత్రి హామీతో..
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను ఇటీవల కలిసిన నిజామబాద్, ఆదిలాబాద్ ఎంపీ లతో మాట్లాడుతూ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారుచేసి పంపాలని చేసిన వ్యాఖ్యలతో ఇక్కడి ప్రాంత ప్రజల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. కేంద్రం ఎట్టకేలకు రైల్వే లైన్ నిర్మాణం కోసం వేగంగా అడుగులు వేస్తుండటం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే లైన్ ఏర్పాటుతో ప్రయోజనాలు
ఈ నూతన రైల్వే లైన్ ఏర్పాటుతో ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అనేక లాభాలు ఈ ప్రాంతానికి చేకూరుతాయి. రైల్వే మార్గాలు సాధారణంగా రవాణా ఖర్చులను తగ్గించడంతో పాటు సమయాన్ని ఆదా చేస్తాయి. పర్యావరణానికి సైతం మేలు చేస్తాయి. సరు కు రవాణాకు చౌకైన మార్గాలుగా రైల్వేలు ఉపయోగపడతాయి.
కొత్త ఉద్యోగాలు సృ ష్టించబడతాయి. ఈ మార్గం వెంబడి ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి జరుగుతుం ది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పర్యాటక సంబంధిత వ్యాపారాలు అభివృద్ధి, రైల్వేలు రహదారి రద్దీని తగ్గిస్తాయి.