15-10-2025 09:15:57 PM
పరమేశ్వర్ రెడ్డి..
ఉప్పల్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మల్లాపూర్ కు చెందిన ఎండి మిస్బా ఇటీవల కాలంలో అనారోగ్యంతో బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని నాచారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు పరమేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలను మంజూర అయ్యే విధంగా చొరవ తీసుకొని వారి యొక్క కుటుంబ సభ్యులకు ఎల్ఓసి పత్రం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.