15-10-2025 09:34:47 PM
మంథని (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, టీపిపిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆదేశాల మేరకు బుధవారం మంథని మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు అక్కపాక గణేష్ కుటుంబానికి 25 కిలోల బియ్యం అప్పగించి వారి కుటుంబాన్ని పరామర్శించి గణేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంథని మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్ ఆయన వెంట ధర్మారం గ్రామ శాఖ అధ్యక్షులు పుల్లె రవి, యూత్ కాంగ్రెస్ నాయకులు గొల్లపెల్లి శ్రీనివాస్, పోరండ్ల రంజిత్, సూరయ్యపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధ్యక్షుడు చంద్రు విజయ్, యూత్ కాంగ్రెస్ నాయకులు బూడిద రమేష్, కొయ్యల వినయ్, తోటపల్లి ఉదేయ్, కిరణ్, గడ్డం శ్రీనివాస్, సందీప్, అక్కపాక సాత్విక్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.