15-10-2025 09:06:35 PM
ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఐ గోవిందరెడ్డి
మేడిపల్లి (విజయక్రాంతి): చెంగిచెర్ల కమలానగర్ కాలనీలో ప్రజల భద్రత,శాంతి,శ్రేయస్సు కోసం ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడినవి. ఈ సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఐ గోవిందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీసీ కెమెరాల ద్వారా ప్రజల భద్రత మరింత బలోపేతం అవుతుంది. రహదారి భద్రత, నేరాల నివారణ, చట్టవ్యవస్థ పర్యవేక్షణలో ఇవి ముఖ్యపాత్ర పోషించనున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఉదయ్ భాస్కర్, కాలనీ ప్రెసిడెంట్ కొత్త మురళీ గౌడ్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.