18 July, 2026 | 5:52 PM

Breaking News

మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •   ప్రజలు పరిశుభ్రంగా ఉండాలంటే వ్యర్థ పదార్థాలు వేరు చేయాలి   •   గోదావరి పుష్కరాల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి   •   ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన చిలుక సతీష్   •   ఘనంగా జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •  

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం

12-08-2024 02:51 PM

కొండపాక:  కొండపాక మండలం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దుద్దెడ గ్రామానికి చెందిన కాట ఎల్లం కు సీఎంఆర్ఎఫ్ ఫండ్ కింద ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా నూనె కుమార్ మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో దుద్దెడ గ్రామానికి చెందిన కాట ఎల్లం రోడ్డు ప్రమాదానికి గురికాగా హాస్పిటల్లో ఆయన ఖర్చులకోసం మాజీ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా సీఎంఆర్ఎఫ్ ఫండ్ నుండి ఇరవై ఐదు వేల రూపాయలు మంజూరు చేశారు. సోమవారం రోజు చెక్కును కాట ఎల్లంకు అందించి,నిరుపేదలు ఎవరైనా ఆసుపత్రిలో  వైద్య ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే ఆర్థిక సహాయo అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి పెద్దoకుల శ్రీనివాస్ గౌడ్,చిక్కుడు బాను గ్రామ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిలుముల రాము మాజీ ఉపసర్పంచి గుండెల్ని ఆంజనేయులు గుండెలు కరుణాకరు, కురాటి బాలమల్లు  తదితరులు పాల్గొన్నారు.