18 July, 2026 | 6:08 PM

Breaking News

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •  

మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన

12-08-2024 03:00 PM

యువకుడికి దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): పాఠశాలకు వెళ్తున్న మైనర్ బాలిక పట్ల ఆకతాయి అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు గుర్తించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై నాగ శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన బోనాసి తరుణ్ (25) మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పాలెం గ్రామంలోని పాఠశాల ముందు నిలబడి వచ్చిపోయే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. సోమవారం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు గుర్తించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గత కొద్ది రోజుల క్రితమే గంజాయి సేవిస్తూ పట్టుబడిన కేసులో బెయిల్ నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.