21 April, 2026 | 11:14 PM

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

12-08-2024 02:48 PM

తొర్రూరు: గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని  మిల్స్ కాలనీ పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని నందమూరి నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ గంజి నర్సింహ బైకుపై గంజాయి తరలిస్తుండగా గవిచర్ల క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. రెండు కిలోల శుద్ధి చేసిన ఎండు గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లయ్య తెలిపారు.