13 August, 2026 | 9:26 PM

తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర కార్యదర్శిగా చికిలంమెట్ల అశోక్.

13-08-2026 08:06 PM

చిట్యాల,(విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల సమితి (టీయూఎస్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మలిదశ ఉద్యమకారుడు చికిలంమెట్ల అశోక్ గురువారం నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యమ కారుల  సమితి అధ్యక్షుడు తోడేటి శంకర్ గౌడ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చికిలం మెట్ల అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించే వరకు తెలంగాణ ఉద్యమకారుల సమితి ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించి, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన కోరారు.