సీఎంఆర్ పెండింగ్ రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి
13-08-2026 07:52 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రైస్ మిల్లర్లలో సీఎంఆర్ ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి కిషన్ మోర్చా అధ్యక్షులు యాదవ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ ను కలిసి నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ పెండింగ్ ఉన్న వారిపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదాయ వనరులను కొల్లగొడుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ మోర్చా సెల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






