రూ.4 లక్షల ఎల్ఓసీ లెటర్ అందజేత
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం లోని మీరుపేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీకి చెందిన పి. నాగరాజు గత కొంతకాలంగా అనారోగ్యతో ఆస్పత్రి ఖర్చులు లేక బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రూ.4 లక్షల విలువైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లెటర్‌ను అందజేశారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ధైర్యం చెప్పి, ప్రభుత్వం పేదల వైద్య చికిత్సకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, స్థానిక నాయకులు ఉమా వెంకటేశ్వరరావు, చారి, శ్రీపతి, వీరభద్రరావు, శేఖర్ గౌడ్, నరేందర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






