18-01-2026 12:59:53 AM
పార్టీ పటిష్టతకు కృషి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్
జనగామ జిల్లాలో పార్టీ కార్యాలయం ప్రారంభం
జనగామ, జనవరి 17(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా కార్యాలయాన్ని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేష్ ఆధ్వర్యంలో శనివారం ముఖ్య అతిథి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ మన పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆశయాల కోసం ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యాలయం పనిచేయాలి, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయా లని పిలుపు నిచ్చారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదరి సతీష్ ముదిరాజ్, యూత్ అధ్యక్షుడు మంద దిలీప్, పట్టణ అధ్యక్షుడు గడ్డం కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సంతోష్, యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు బోడా రమేష్, జఫర్‌గడ్ మండల అధ్యక్షుడు కాలకోట బాబు, యూత్ మండల అధ్యక్షులు ముక్క విష్ణువర్ధన్, పట్టణ కార్యదర్శి వల్లాల బానుచందర్, ఉమేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.