18-01-2026 02:52:08 PM
రాజాపూర్: బాల్యవివాహాలు చట్టారీత్యా నేరమని 18 సంవత్సరాల్లోపు బాల బాలికలకు వివాహం చేస్తే అందుకు జైలుశిక్షతో పాటు జరిమానాలు ఉంటాయని రాజాపూర్ గ్రామ సర్పంచ్ కావలి రామకృష్ణ అన్నారు. శనివారం రాజాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్, బాల్య వివాహాల నివారణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కావలి రామకృష్ణ మాట్లాడుతూ... అనేక కారణాలు వల్ల చిన్న వయస్సులోనే వివాహాలు చేయటం సరైనది కాదన్నారు. చిన్న వయస్సులోనే వివాహాలు చేయటం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు శారీరక సమస్యలు ఏర్పడతాయన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ నైముద్దీన్, శంకర్ బాబు, బుచ్చిరెడ్డి, పద్మయ్య, మహమ్మద్ జహంగీర్ , కటికే బాల్ రాజ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.