calender_icon.png 18 January, 2026 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నావికాదళపతిగా కుగ్రామ యువకుడి ఎంపిక

18-01-2026 02:48:24 PM

పిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ 

అభినందించిన గ్రామస్థులు, యువకులు 

కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు లోని మారుమూల గ్రామం రంగ శివుని కి చెందిన తోట సాయినాథ్ -రజిత దంపతుల కుమారుడైన తోట రాజేశ్వర్ (10+2) చదువు (18 సంవత్సరాల వయసు)లో సీనియర్ సెకండరి రీక్రూట్(SSR)లో తన మొదటి ప్రయత్నంలోనే అగ్నివీర్ నావీకాదళపతిగా ఎంపికై ఔరా అనిపించుకున్నాడు.

ఇందులో అగ్నివీరులు ఆధునిక నౌకలు, నిర్వహణ, ఆపరేషన్స్, జలాంతర్గాములలో ప్రాథమిక శిక్షణ అనంతరం కేటాయించిన ట్రేడ్ లో వృత్తిపరమైన శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామంలో ప్రప్రథమ కేంద్ర ప్రభుత్వ నేవి ఉద్యోగం సాధించిన యువకుడిగా రాజేశ్వర్ నిలవడం గమనార్హం. ఈయన్ను శనివారం గ్రామస్థులు, యువకులు, స్నేహితులు సత్కరించి అభినందించారు. సర్పంచ్ మెట్టు లక్ష్మీ, మాజీ సర్పంచ్ దత్తురామ్ పటేల్, కుప్టి ఉప సర్పంచ్ గుండోళ్ల  శ్రీనివాస్ అలియాస్ చిన్ను తదితరులు ఉన్నారు.