పసికందు అపహరణకు 72 గంటల్లోనే చెక్..!
రూ.1.5 లక్షలకు శిశువును కోల్‌కతాకు తరలించే కుట్ర
చందానగర్ పోలీసుల చాకచక్యంతో బాలల అక్రమ రవాణా ముఠా అరెస్ట్
శేరిలింగంపల్లి, జూలై 3 (విజయక్రాంతి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంపై నిద్రిస్తున్న సర్కస్ కార్మికురాలి ఒడి నుంచి నెల వయసు పాపను ఎత్తు కెళ్లిన అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా ఆటలు మూడు రోజుల్లోనే చెక్ పెట్టిన చందానగర్ పోలీసులు. పిల్లలు లేని కోల్కతా మహిళకు రూ.1.5 లక్షలకు విక్రయించి, ఫ్లైట్లో కోల్కతాకు తరలించేందుకు సిద్ధమైన నిందితులను అదుపులోకి తీసుకుని పాపను క్షేమంగా తల్లికి అప్పగించారు.
జూన్ 30 తెల్లవారుజా ము 2 గంటలు. బీదర్ జిల్లా బాల్కి గ్రామానికి చెందిన శాంతాబాయి కుటుంబ సభ్యుల తో కలిసి లింగంపల్లి స్టేషన్ గోడ పక్కన నిద్రిస్తోంది. నెల వయసున్న ఆమె పాప ఒడిలో కదులుతోంది. అంతలో ఆటోలో వచ్చిన ఇద్దరు ఆగంతకులు మెరుపు వేగంతో పాపను లాక్కుని పరారయ్యారు. ఏడుపుతో మేల్కొన్న తల్లి వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. తెల్లవారుజాము 4 గంటలకు చందానగర్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు అందింది.
ఆర్సీ పురం ఏసీపీ సీహెచ్.వై. శ్రీనివాస్ వెంటనే రంగంలోకి దిగారు. ఇన్స్‌పెక్టర్ విజ య్, ఎస్‌ఐలు సత్యనారాయణ, అమీన్‌పూర్ డీఐ ఎన్. భాస్కర్‌తో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సైబరాబాద్, మ ల్కాజిగిరి, హైదరాబాద్లోని వందలాది సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు. నిందితులు వికారాబాద్ వైపు వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. అసలు కుట్ర కోల్‌కతాలో మొ దలైంది. టాప్సియాకు చెందిన రహనుమా అలీకి 2021లో పెళ్లయ్యింది.
సంతానం లేకపోవడంతో డబ్బు ఇచ్చి అయినా బిడ్డను తెచ్చివ్వాలని హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉండే పిన్ని నిమ్మి జహానీ సీమాను అడిగింది. సీమ తన స్నేహితురాలు నేరేడ్మెట్కు చెందిన నాజియాకు చెప్పింది. నాజియా తనకు కాబోయే భర్త వికారాబాద్‌కు చెందిన మహ్మద్ జుబేర్‌కు ‘పాపను తెస్తే లక్షలు వస్తాయి’ అని ఎర వేసింది. జుబేర్ వెంటనే దొంగతనం కేసులో గతంలో జైలుకు వెళ్లిన ఆటో డ్రైవర్ మహ్మద్ ఇర్ఫాన్‌ను కలుపుకొన్నాడు. జూన్ 30న తెల్లవారుజామున ఇద్ద రూ స్నేహితుడు ఆరిఫ్ ఆటోను తీసుకుని లింగంపల్లి చేరుకున్నారు. ప్లాట్ఫాంపై నిద్రిస్తున్న శాంతాబాయి ఒడిలోని పాపను ఎత్తు కెళ్లి నేరేడ్మెట్లోని నాజియా ఇంట్లో దాచారు. వెంటనే సీమ, రహనుమా అలీకి ఫోన్ చేశారు.
జులై 1న రహనుమా తన పిన్ని సర్వరీతో కలిసి ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చింది. డీల్ ప్రకారం జుబేర్కు ఆన్లైన్లో రూ.1.5 లక్షలు పం పింది. పాపను కోల్కతాకు తీసుకెళ్లేందుకు నిందితులు ఏర్పాట్లు చేసుకుంటుండగా పో లీసుల ప్రత్యేక బృందాలు దాడి చేశాయి. ఈ కేసులో వికారాబాద్‌కు చెందిన మహ్మద్ జుబేర్, మహ్మద్ ఇర్ఫాన్, నేరేడ్‌మెట్‌కు చెందిన నాజియా, బంజారాహిల్స్‌కు చెంది న నిమ్మి జహానీ సీమ, కోల్‌కతాకు చెందిన రహనుమా అలీని అరెస్ట్ చేశారు. పాపను తల్లి శాంతాబాయికి అప్పగించారు. మూడు రోజుల్లోనే అంతర్రాష్ట్ర చైల్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకుని పాపను కాపాడిన చందానగర్ పోలీసులను సైబరాబాద్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.






