పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు,పుస్తకాలు ఉండాలి
12-06-2026 04:29 PM
నేరేడుచర్ల బీఆర్ఎస్ నాయకుడు రాపోలు నవీన్ కుమార్
నేరేడుచర్ల,(విజయక్రాంతి): భారతదేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉందని, వారి చేతుల్లో పుస్తకాలు ఉండాలి గాని పనిముట్లు కాదని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్ కుమార్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవ సందర్బంగా శుక్రవారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఇటుక బట్టిలో ఉన్న పిల్లలకు చదువు విలువ గురించి వివరించారు. ప్రతి చిన్నారికి విద్య, స్వేచ్ఛ, సురక్షిత బాల్యం అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.






